నిత్యామీనన్ త్వరలో తెలుగు, తమిళ భాషలలో ‘మాలిని 22’ సినిమా రూపంలో మనల్ని పలకరించనుంది. మునుపటి తరంనటి శ్రీప్రియ దర్శకురాలిగా మారింది. రాజ్ కుమార్ థియేటర్స్ బ్యానర్ పై రాజ్ కుమార్ సేతుపతి ఈ సినిమాను నిర్మిస్తున్నారు
ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జోరుగా సాగుతున్న ఈ సినిమా డబ్బింగ్ చెన్నైలో జరుగుతుంది. అరవింద్ – శంకర్ సంగీతాన్ని అందించారు. ప్రస్తుతం రీ రికార్డింగ్ పనుల్లో వున్నారు. ఈ సినిమాలో క్రిష్ సతార్ మరియు నరేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కన్నడలో విజయం సాధించిన ’22 ఫిమేల్ కొట్టాయం’ సినిమాకు రీమేక్.
మనోజ్ పిళ్ళై సినిమాటోగ్రాఫర్. అత్యాచారం కారణంగా తనకు అన్యాయం జరిగిన ఒక యువతి న్యాయం కోసం చేసే పోరాటమే ఈ సినిమా కధ. ఈ చిత్ర విజయంపై నిత్యామీనన్ నమ్మకంగా వుంది. “ఇటువంటి సినిమా అందరినీ ఆలోచించేలా చేస్తుంది. దర్శకురాలు నాకు కదా చెప్పినప్పుడు ఎంతో నచ్చి నేనే స్వయంగా చేస్తానని చెప్పా” అని ఆడియో విడుదల వేడుకలో తెలిపింది