రవితేజ సరసన ‘నేల టిక్కెట్టు’ సినిమాలో మెరిసిన హీరోయిన్ మాళవిక శర్మ గుర్తుండే ఉంటుంది. మొదటి సినిమాతోనే కుర్రాకారులో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మాయి ప్రస్తుతం రామ్ సరసన ‘రెడ్’ చిత్రంలో నటిస్తోంది. ఇలా ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రెగ్యులర్‌గా నాంపల్లి క్రిమినల్ కోర్టుకు కూడా వెళుతోందట. ఎందుకంటే ఈమె లా స్టూడెంట్. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతోంది.
చదువులో భాగంగా చివరి సంవత్సరం సీనియర్ లాయర్ వద్ద ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఆమె హైదరాబాద్లోని ఓ ప్రముఖ క్రిమినల్ లాయర్ వద్ద ఇంటర్న్‌గా వ్యవహరిస్తోంది. షూటింగ్ లేనప్పుడల్లా కోర్టుకు వెళుతోంది. ఇది పూర్తవగానే పరీక్షలు ఉంటాయని, అవి ముగిస్తే తాను లాయర్ అవుతానని, అప్పుడు నేరుగా కేసులు టేకప్ చేస్తానని అంటోంది. మొత్తానికి సినిమాతో బిజీగా ఉన్నా కూడా చదువును కొనసాగిస్తూ భేష్ అనిపించుకుంటోంది మాళవిక.