బాలీవుడ్‌లో బడా ప్రాజెక్ట్ పట్టేసిన ‘ది రాజా సాబ్’ బ్యూటీ..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కామెడీ హారర్ చిత్రం ‘ది రాజా సాబ్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో అందాల భామలు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాతో మాళవిక మోహనన్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాపై మాళవిక భారీ అంచనాలు పెట్టుకుంది.

తమిళంలో ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, ఇప్పుడు తెలుగులో కూడా సాలిడ్ ఎంట్రీ ఇస్తుండటం తో ఈమె నెక్స్ట్ చిత్రాలపై కూడా క్రేజ్ క్రియేట్ అవుతుంది. అయితే, మాళవిక ప్రస్తుతం ఓ భారీ ప్రాజెక్ట్‌ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లోని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ చేయబోయే భారీ పాన్ ఇండియా మూవీలో మాళవిక హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యిందట.

అయితే, ఈ సినిమాకు సంబంధించిన వివరాలు అధికారికంగా రావాల్సి ఉంది. ఏదేమైనా ప్రస్తుతం పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తున్న మాళవిక, తన గ్లామర్‌తో పాటు పర్ఫార్మెన్స్‌తో కూడా ప్రేక్షకులను ఆక్టటుకునేందుకు సిద్ధమవుతుంది.

Exit mobile version