‘వీరమల్లు’ ట్రైలర్.. మేకర్స్ నుంచి గ్రాండ్ అప్డేట్!

‘వీరమల్లు’ ట్రైలర్.. మేకర్స్ నుంచి గ్రాండ్ అప్డేట్!

Published on May 4, 2025 7:58 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రాల్లో “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. దర్శకులు క్రిష్ ఇంకా జ్యోతి కృష్ణలు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇపుడు ఒక కొలిక్కి వస్తుంది. పవన్ కళ్యాణ్ షూటింగ్ లో నేడు జాయిన్ అయినట్టుగా నేడు మేము తెలిపాము. ఇపుడు మేకర్స్ దీనిపై అధికారికంగా క్లారిటీ ఇచ్చేసారు. పవన్ ప్రస్తుతం రెండు రోజులు షూటింగ్ లో పాల్గొననున్నారు అని దీనితో సినిమా గ్రాండ్ గా ఒక ముగింపుకి వచ్చేసినట్టే అని చెబుతున్నారు.

అలాగే అతి త్వరలోనే హరిహర వీరమల్లు సాలిడ్ ట్రైలర్ సహా మంచి పాటలు అన్నీ రాబోతున్నాయి అంతా సిద్ధంగా ఉండాలని అలెర్ట్ చేస్తున్నారు. మొత్తానికి మాత్రం ఇది పవన్ అభిమానులకి ఒకింత గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఇక ఈ భారీ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. అలాగే త్వరలోనే అధికారిక రిలీజ్ డేట్ ఈ సినిమాపై రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు