వైజాగ్ లో మహేష్ రేర్ ఫీట్.

సంక్రాంతి వెళ్లి ఇరవై రోజులు దాటిపోయినా మహేష్ మూవీ వసూళ్లు రాబడుతూనే ఉంది. ఇక ఈ చిత్రం వైజాగ్ లో రేర్ ఫీట్ సాధించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్ లో 1 కోటి రూపాయలకు పైగా వసూళ్లు సాధించి అరుదైన రికార్డ్ నమోదు చేసింది. వైజాగ్ లోని సింగిల్ స్క్రీన్ థియేటర్ జగదాంబలో మహేష్ సరిలేరు నీకెవ్వరు 23రోజులకు 1,00,24,366/- రూపాయల వసూళ్లు సాధించి రికార్డ్ నెలకొల్పింది. సింగిల్ స్క్రీన్ థియేటర్ లో కోటిరూపాయల వసూళ్లు సాధించడం చెప్పుకోదగ్గ విషయమే. ఇక సరిలేరు నీకెవ్వరు మహేష్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.

దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, రష్మిక మందాన హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ ఈ చిత్రాన్నీ సంయుక్తంగా నిర్మించారు. ఇక సరిలేరు నీకెవ్వరు మూవీలో విజయ శాంతి కీలక రోల్ పోషించగా దేవిశ్రీ సంగీతం అందించారు. మహేష్ తన నెక్స్ట్ మూవీ దర్శకుడు వంశీ పైడిపల్లితో చేస్తున్న విషయం తెలిసిందే.

Exit mobile version