సితారతో మహేష్ టెడ్డీ కచేరీ !

సితారతో మహేష్ టెడ్డీ కచేరీ !

Published on May 16, 2020 11:40 AM IST

ఈ లాక్ డౌన్ సమయంలో గత కొన్ని వారాల నుండి నమ్రతా మహేష్ వాళ్ల గారాలపట్టి సితార వీడియోలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. సితార అల్లరి వీడియోలతో పాటు, సింగింగ్, డాన్సింగ్ టాలెంట్స్ కూడా పరిచయం చేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన ముద్దుల తనయ సితారతో చిన్నపిల్లాడిలా మారిపోయి డెడ్డీ బెర్రీతో ఆడుకుంటున్న వీడియోను పోస్ట్ చేసింది నమ్రత.

ఈ వీడియోలో మహేష్ – సితార మధ్య అనుబంధం, ప్రేమ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మహేష్ చిలిపితనం సితార చిన్నతనం కలిసి మంచి అనుభూతిని ఇచ్చింది ఈ వీడియో. ఇక ఈ వీడియోతో పాటు నమ్రత మెసేజ్ పోస్టు చేస్తూ… ‘ప్రేమ, జీవితం మరియు నవ్వు.. మహేష్ – సితు పాప మధ్య చిన్న టెడ్డీ కచేరీ. ఇక సితార మాత్రమే మహేష్ లో ఉన్న చిన్నపిల్లాడిని బయటకు తీసుకురాగలదు’అని పోస్ట్ చేశారు.

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ రాబోతుంది. అయితే ఈ లాక్ డౌన్ సమయంలో, మహేష్ పూర్తిగా తన కుటుంబ సభ్యులుతో గడుపుతున్నాడు.

https://www.instagram.com/p/CAPCdPjDvb_/

సంబంధిత సమాచారం

తాజా వార్తలు