సూపర్ స్టార్ మహేష్ సోషల్ మీడియా ద్వారా పారిశుధ్య కార్మికుల శ్రమను, ఉద్యోగ బాధ్యతను కొనియాడారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో వారు పరిసరాలు పరిశుభ్రంగా ఉండడానికి అందింస్తున్న సేవలకు హృదయ పూర్వక ధన్యవాదులు తెలిపారు. ప్రణాంతక కరోనా వైరస్ కి బయపడి మనం ఇంటికే పరిమితం అవుతుంటే, వారు మన ఆరోగ్య భద్రత కోసం వీధుల్లోకి వచ్చి ప్రమాదకర పరిస్థితులలో పని చేస్తున్నారు అన్నారు. పారిశుధ్య కార్మికుల శ్రమకు కృతజ్ఞతలు తెలుపుతూ మహేష్ బాబు ఇంస్టాగ్రామ్ లో ఇలా సందేశం పోస్ట్ చేశారు.
ఇక కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి పోలీసులు మరియు వైద్య సిబ్బంది చేస్తున్న కృషికి మహేష్ కృతఙ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే. కాగా మహేష్ త్వరలో తన నెక్స్ట్ మూవీ ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే నెల 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు కావడంతో ఆ రోజు మహేష్ కొత్త మూవీపై ప్రకటన వచ్చే అవకాశం కలదు.
https://www.instagram.com/p/B_CCLvcH6FE/