బంజారా హిల్స్ లో జరుగుతున్న మహేష్ ‘1’ షూటింగ్

బంజారా హిల్స్ లో జరుగుతున్న మహేష్ ‘1’ షూటింగ్

Published on Sep 6, 2013 11:45 AM IST

1Nenokkadine
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘1-నేనొక్కడినే’ మూవీ షూటింగ్ ప్రస్తుతం బంజారా హిల్స్ లో జరుగుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం తీస్తున్న సీన్స్ ని ఓ డయాగ్నొస్టిక్ సెంటర్ దగ్గర తీస్తున్నారు. కృతి సనన్ హీరోయిన్ గా కనిపించనుంది.

సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. గత నెలలో ఈ సినిమా షూటింగ్ లండన్ లో జరిగింది. హైదరాబాద్ షెడ్యూల్ మరి కొద్ది రోజుల్లో ముగుస్తుంది ఆ తర్వాత ఈ చిత్ర టీం బ్యాంకాక్ కి వెళ్లనున్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు. 1-నేనొక్కడినే షెడ్యూల్ 2014 సంక్రాంతికి రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు చాలా స్టైలిష్ గా కనిపించనున్నాడు.

తాజా వార్తలు