సితార సింగింగ్ వీడియో పంచుకొని మురిసిపోతున్న నమత్ర

సితార సింగింగ్ వీడియో పంచుకొని మురిసిపోతున్న నమత్ర

Published on Apr 18, 2020 9:00 PM IST

టాలీవుడ్ స్టార్ కపుల్ మహేష్-నమ్రత లది క్యూట్ హ్యాపీ ఫ్యామిలీ. ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంటకు గౌతమ్, సితార ఇద్దరు పిల్లలు. పెళ్లి తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పిన నమ్రత మంచి గృహిణిగా మారింది. ఆమె మహేష్ కి సలహాదారు కూడా అని తెలుస్తుంది. ఇక మహేష్ షూటింగ్ కి విరామం దొరికితే పిల్లలతో విదేశీ టూర్స్ కి చెక్కేస్తారు. సోషల్ మీడియాలో తమ అప్డేట్స్ పంచుకుంటూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంటారు.

ఇక ఆ హ్యాపీ ఫ్యామిలీలో చిచ్చర పిడుగు సితారదే అల్లరంతా. ఈ సితార సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. తన ఫొటోస్ మరియు మహేష్ సాంగ్స్ స్టెప్స్ వేస్తూ వీడియోలు సోషల్ మీడియాలో పంచుకుంటుంది. కాగా గతంలో ఎప్పుడో ఓ పాటను అనుకరిస్తూ పాడిన సితార వీడియోని నమ్రత ఇంస్టాగ్రామ్ లో పంచుకుంది. ‘ప్రతి రోజు ఏదో ఒకటి చేస్తూ ఉండే.. నాన్న గారాల పట్టి’ అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అవుతున్న మహేష్ పిల్లలతో సరదాగా ఆడుకుంటున్నాడు.

https://www.instagram.com/tv/B_HTLBTDJ1_/?igshid=w5g5fadg45ya

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు