మహేష్ కూడా రజినీలా..?

మహేష్ కూడా రజినీలా..?

Published on Mar 10, 2020 8:00 AM IST

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం విరామంలో ఉన్నారు. అలాగే ఆయన తదుపరి సినిమా ఎవరితో ఉంటుంది అనే విషయంలో కూడా సందిగ్దత కొనసాగుతుంది. ముందుగా అనుకున్నట్లు ఆయన దర్శకుడు వంశీ పైడిపల్లితో చేయడం లేదని వార్తలు వస్తున్నాయి. మరో ప్రక్క మహేష్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిరు 152వ చిత్రంలో ఓ కీలకరోల్ చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఏదిఏమైనా మహేష్ ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు.

ఐతే ఈ ఖాళీ సమయంలో ఆయన ఓ ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లాలని చూస్తున్నారట. అందుకోసం ఆయన హిమాలయాలను ఎంచుకున్నారట. త్వరలో మహేష్ హిమాలయాలను సందర్శించనున్నారని వస్తున్న సమాచారం. ఇక ఆధ్యాత్మిక చింతన అధికంగా ఉండే రజిని కాంత్ తరచుగా హిమాలయాలను సందర్శిస్తారు. అక్కడ ఉన్న ఓ బాబా ను ఆయన కలవడం జరుగుతుంది. ఇప్పుడు మహేష్ సైతం హిమాలయాలను సందర్శించాలని కోరుకోవడం ఆసక్తిరేపుతుంది.

తాజా వార్తలు