మరో బ్రాండ్ కి సైన్ చేసిన మహేష్ !

మరో బ్రాండ్ కి సైన్ చేసిన మహేష్ !

Published on Mar 9, 2020 5:36 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబుకు మాదిరిగా టాలీవుడ్ లో మరో ఏ హీరోకు ఎక్కువ బ్రాండ్స్ లేవు. దేశంలోనే కొన్ని పెద్ద బ్రాండ్లకు మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఆన్‌ లైన్‌ లో కార్లను విక్రయించి కొనుగోలు చేసే కార్ దేఖో పోర్టల్ కు బ్రాండ్ అంబాసిడర్‌గా మహేష్ సంతకం చేశారు. మహేష్ ఇప్పటికే తన లిస్ట్ లో 22 ఇతర బ్రాండ్లకు అంబాసిడర్ గా ఉన్నాడు.

ఇక ‘గీత గోవిందం’ పరుశురామ్ తో తన తర్వాత సినిమాని సూపర్ స్టార్ మహేశ్ బాబుతోనే ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఎలాగూ వంశీ పైడిపల్లితో సినిమాను క్యాన్సల్ చేసుకున్న మహేష్.. పరుశురామ్ కథకు ఓకే చెప్పాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. పరుశురామ్ మహేష్ బాబు కోసం స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారట.. అన్ని కుదిరితే త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళటానికి చూస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

తాజా వార్తలు