మహేష్ బొమ్మ అక్కడ కూడా దద్దరిల్లిందా?

మహేష్ బొమ్మ అక్కడ కూడా దద్దరిల్లిందా?

Published on Nov 20, 2020 12:00 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా వరుస హిట్ చిత్రాల దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి భారీ హిట్ గా నిలిచింది. గట్టి పోటీ ఉన్నప్పటికీ భారీ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

అయితే తెలుగులో సెన్సేషనల్ హిట్ తో బాక్సాఫీస్ ను దద్దరిల్లించిన మహేష్ ఇప్పుడు లాక్ డౌన్ అనంతరం తమిళ్ లో తమిళ్ డబ్బింగ్ వెర్షన్ ను విడుదల చేయగా దానికి అక్కడ కూడా అదే రేంజ్ లో గ్రాండ్ రిలీజ్ తో వస్తున్నట్టు తెలుస్తుంది.

మొదట చిన్నగా 170 థియేటర్స్ లో విడుదల చేయాలని ప్లాన్ చెయ్యగా ఇప్పుడు ఆ సంఖ్యా మరో 50కు చేరి మొత్తం 220 స్క్రీన్ లలో విడుదల అయ్యింది. ఇలాంటి కోవిడ్ తర్వాత ఇది సాలిడ్ రిలీజ్ అనే చెప్పాలి. మహేష్ కు అక్కడ కూడా మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. మరి అక్కడ ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

తాజా వార్తలు