సూపర్ స్టార్ మహేష్ స్టామినా ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన టాలీవుడ్ లో టాప్ స్టార్స్ లో ముందు వరుసలో ఉంటారు. ఇక ఈ మధ్య వరుస విజయాలతో మహేష్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. కాగా సోషల్ మీడియాలో కూడా ఆయన దూసుకుపోతున్నారు. ట్విట్టర్ లో ఆయన ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 9మిలియన్స్ కి చేరింది. సౌత్ ఇండియాలోనే ఇంత మంది ఫాలోవర్స్ కలిగిన ఏకైక హీరో మహేష్ బాబు.
ఇక మహేష్ ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ నమోదు చేసుకున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది.ఇక మహేష్ తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు వంశీ పైడిపల్లితో చేయాల్సివుండగా ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే చిరు-కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న మూవీలో మహేష్ ఓ కీలక రోల్ చేస్తున్నారనే గట్టి ప్రచారం కూడా జరుగుతుంది.