హిందీలో రీమేక్ కానున్న మహేష్ బాబు ఒక్కడు

హిందీలో రీమేక్ కానున్న మహేష్ బాబు ఒక్కడు

Published on Oct 6, 2012 7:55 PM IST


మహేష్ బాబు ప్రధాన పాత్రలో 2003లో విడుదలయి సంచలన విజయం సాదించిన చిత్రం “ఒక్కడు” హిందీలో రీమేక్ చెయ్యనున్నారు. బోనీ కపూర్ తన తనయుడు అయిన అర్జున్ కపూర్ కోసం ఈ చిత్ర హక్కులను కొనుక్కున్నారు. అర్జున్ కపూర్ “ఇషాక్ జాదే” చిత్రంతో తెరంగేట్రం చేశారు. కొన్నేళ్ళ క్రితం ఈ చిత్రాన్ని అభిషేక్ బచ్చన్ ,భూమిక మరియు సంజయ్ దత్ ప్రధాన పాత్రలలో తెరకెక్కించాలని అనుకున్నారు కాని అది జరగలేదు. ఇప్పుడు బోని కపూర్ ఈ చిత్ర రీమేక్ హక్కులను కొనుక్కున్నారు ప్రస్తుతం ఈ చిత్రం యొక్క ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్ర బృందం గురించి మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఒక్కడు” చిత్రం మహేష్ బాబు కెరీర్లో ఒక మలుపు వంటింది. ఇలానే ఈ చిత్రం అర్జున్ కపూర్ కి కూడా ఈ చిత్రం మలుపు కానుందా? వేచి చూడవలసిందే.

తాజా వార్తలు