మహేష్ బాబు నటించిన థమ్స్ అప్ కొత్త యాడ్ ఈరోజే విడుదలయ్యి, అప్పుడే పాపులర్ అయిపొయింది. ఈ ప్రకటన గత ఏడాది వచ్చిన ‘ఈవేళ ఏదోకటి అదరగోడదాం’ ప్రచారానికి కొనసాగింపు. ఈ ప్రకటనని ఆర్.యూ ఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్ పై రవి ఉద్యవార్ డైరెక్ట్ చేసాడు. సల్మాన్ ఖాన్ హిందీ వెర్షన్ లో నటించగా తెలుగు వెర్షన్లో మహేష్ కనిపించాడు. మహేష్ బాబు లుక్, అతని విన్యాసాలు, యాక్షన్ టేకింగ్ ఇప్పటికే అంతటా వ్యాపించింది.
ఈ ప్రకటన గురించి మహేష్ మాట్లాడుతూ “ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశం హీరోలు అనే వారు సృస్టించబడరు, తయారు చేయబడతారు అని. నేను ఈ సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్ముతాను. ఇందులో దాగున్న సందేశం ఏంటంటే ప్రతీ ఒక్కరిలోనూ ‘తూఫాన్’ ఉంటుంది. ఏదైనా తూఫాన్ లాంటి పని చేసినప్పుడే అది బయటపడతుందని” చెప్పారు.
మహేష్ బాబు ప్రస్తుతం సుకుమార్ తెరకెక్కిస్తున్న థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నాడు. దీని తరువాత అతను శ్రీను వైట్ల, పూరి జగన్నాధ్, వంశీ పైడిపల్లి మరియు క్రిష్ తీయబోయే చిత్రాలలో నటిస్తాడు.