వెంకీ పుట్టిన రోజుకి మహేష్ మాస్టర్ ప్లాన్

వెంకీ పుట్టిన రోజుకి మహేష్ మాస్టర్ ప్లాన్

Published on Nov 19, 2012 12:24 PM IST


విక్టరీ వెంకటేష్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నదమ్ములుగా త్వరలో మనముందుకు రానున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. ఈ సినిమాలో ఉండే అన్నదమ్ముల అనుబందం వీరిద్దరి నిజ జీవితంలో కూడా కొనసాగుతున్నట్టు ఉంది. మాకు అందిన సమాచారం ప్రకారం మన మహేష్ బాబునే ”సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఆడియోని డిసెంబర్ 13న విడుదల చేద్దామని సలహా ఇచ్చారట. వెంకటేష్ గారి బర్త్ డే రోజు ఆయనకి ఇలా మనం గిఫ్ట్ ఇస్తే బాగుంటుందని మహేష్ బాబు ఈ డేట్ ని సజెస్ట్ చేసారు. ఇలా ఇండస్ట్రీలోని ఇద్దరు పెద్ద హీరోల మధ్య ఇలాంటి స్నేహభావం ఉండటం ఎంతో శుభ సూచకం అని చెప్పుకోవాలి.

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తెరకెక్కుతున్న ఈ మల్టీ స్టారర్ చిత్రం పై వెంకటేష్ మరియు మహేష్ బాబు అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. మిక్కీ జె.మేయర్ సంగీతమందిస్తున్న ఈ సినిమాని 2013 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు