1 కోసం ముంబై వెళ్లనున్న మహేష్ బాబు

1 కోసం ముంబై వెళ్లనున్న మహేష్ బాబు

Published on Nov 25, 2013 9:34 AM IST

1-Nenokkadine-Movie-New-Tra
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘1-నేనొక్కడినే’ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాలోని పతాక సన్నివేశాలను ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించారు. దాంతో ఒక్క పాట మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. మిగిలి ఉన్న ఒక్క పాటని ఈ నెల 28 నుంచి ముంబైలో షూట్ చేయనున్నారు. అలాగే ఈ సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.

మహేష్ బాబు స్టైలిష్ లుక్ లో కనిపించనున్న ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా కనిపించనుంది. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ చిత్ర ఆడియో డిసెంబర్ మధ్యలో విడుదలకానుంది. ఈ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ ని
14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు