హృదయం ఎక్కడున్నది ఆడియో లాంచ్ కి రానున్న మహేష్ బాబు

హృదయం ఎక్కడున్నది ఆడియో లాంచ్ కి రానున్న మహేష్ బాబు

Published on Nov 25, 2013 7:05 PM IST

Mahesh-Babu-to-attend-Hruda

ఈ నెల 26వ తేదీ సాయంత్రం హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో జరగనున్న ‘హృదయం ఎక్కడున్నది’ ఆడియో లాంచ్ కార్యక్రమానికి సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ద్వారా కృష్ణ మాధవ్ హీరోగా పరిచయం కానున్నాడు. చెప్పాలంటే కృష్ణ మాధవ్ మహేష్ బాబుకి బంధువు అవుతాడు. ఈ కార్యక్రమానికి మహేష్ బాబుతో పాటు హీరో ఆది, శ్రీమతి గల్లా అరుణ, గల్లా జయదేవ్ హాజరుకానున్నారు.

‘హృదయం ఎక్కడున్నది’ సినిమాని పవన్ – సంజయ్ సంయుక్తంగా నిర్మించారు. ఎఆర్ మురుగదాస్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి విశాల్ చంద్ర శేఖర్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. హర్ష వర్ధన్, ఆహుతి ప్రసాద్, ధనరాజ్, పృథ్వి మరియు కొంతమంది సీనియర్ నటీనటులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

తాజా వార్తలు