సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ప్రస్తుతం అండర్-ప్రొడక్షన్ జరుగుతోంది. ఈ సినిమా అత్యున్నత సాంకేతిక విలువలతో, భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా థ్రిల్లర్ నేపద్యంతో తెలుగు సినిమాలో ఎక్కడ లేని విదంగా కొత్త రకం స్క్రీన్ప్లే తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు న్యూ లుక్ లో కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమాని లండన్ లో 40 రోజులు షూట్ చేయడానికి ఈ చిత్రబృందం కొద్ది రోజుల్లో లండన్ వెళ్లనుంది. కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాని 2013 (ఈ) సంవత్సరంలో సెకండ్ హాఫ్ లో విడుదల చేసే అవకాశం ఉంది.