లండన్లో తెరకెక్కనున్న మహేష్ బాబు – సుకుమార్ మూవీ

లండన్లో తెరకెక్కనున్న మహేష్ బాబు – సుకుమార్ మూవీ

Published on Feb 18, 2013 3:41 PM IST

mahesh

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో చేస్తున్న సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. లండన్లో 40 రోజుల పాటు షూటింగ్ చేయనున్నారు. ముందుగా ప్రొడక్షన్ టీం ఈ మూవీని బుడపెస్ట్ లో షూట్ చేయ్యాలనుకున్నారు కానీ అదిరిపోయే విజువల్స్ కోసం లండన్ కి మార్చారు. గతంలో మహేష్ బాబు తో బ్లాక్ బస్టర్ మూవీ ‘దూకుడు’ తీసిన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ఇది.

ఈ సినిమా కథ, అలాగే తెరపై చూపించే విధానం చాలా ఫ్రెష్ గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ కూడా ఈ సినిమాకి సరికొత్త ట్యూన్స్ కంపోజ్ చేసే పనిలో ఉన్నాడు. కృతి సనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ఈ సినిమా 2013 సెకండాఫ్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు