రేపు విజయవాడలో హాల్ చల్ చెయ్యడానికి మహేష్ బాబు సిద్దం అయ్యారు. విజయవాడలో జోస్ అల్లుకాస్ ఓపెనింగ్ కోసం మహేష్ బాబు ఉదయం 11 గంటలకు విజయవాడ చేరుకోనున్నారు. దీనికోసం ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది మాకు అందిన సమాచారం ప్రకారం మహేష్ బాబు ఒక ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లనున్నారు. “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్ర విజయం తరువాత అయన ఇలా జనంలోకి రావడం ఇదే మొదటిసారి కావడంతో భారీగా జనసందోహం ఏర్పడనుంది. ఇదిలా ఉండగా మహేష్ బాబు జనవరి 18 నుండి సుకుమార్ దర్శకత్వంలో రానున్న చిత్ర చిత్రీకరణలో పాల్గొననున్నారు. కృతి సనన్ ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన ప్రధాన పాత్రా పోషిస్తుంది. గోపిచంద్రం ఆచంట మరియు అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.