ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర ఊహాతీత హైప్ ఉన్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుల భారీ ప్రాజెక్ట్ అని చెప్పాలి. అయితే ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ లేదా లీక్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. మరి ఈ నవంబర్ లో రానున్న బిగ్ అప్డేట్ కోసం ఇప్పుడు నుంచే హడావుడి కూడా స్టార్ట్ అయ్యింది.
అయితే నవంబర్ లో ఈ సినిమా అనౌన్సమెంట్ కోసం మేకర్స్ భారీ ప్లానింగ్ లు చేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. హైదరాబాద్ లోనే ఓ గ్రాండ్ ఈవెంట్ ని సెట్ చేసి అందులో సినిమా టైటిల్ ఇంకా మహేష్ ఫస్ట్ లుక్ ని రివీల్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా వినిపిస్తుంది. ఇక ఈ ఈవెంట్ ని మేకర్స్ నవంబర్ 16న ప్లాన్ చేస్తున్నట్టుగా వినిపిస్తుంది. సో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఇంకా ఈ క్రేజీ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్న వారు ఆ రోజు వరకు వెయిట్ చేయాల్సిందే అని చెప్పాలి. మరి ఈ సెన్సేషనల్ కలయిక ఎలాంటి ట్రీట్ ని ప్రామిస్ చేస్తారో చూడాలి.