పూరి స్క్రీప్ట్ కి ఒకే చెప్పిన మహేష్ బాబు

పూరి స్క్రీప్ట్ కి ఒకే చెప్పిన మహేష్ బాబు

Published on Mar 5, 2013 4:10 PM IST

mahesh puri

సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ పూరిజగన్నాథ్ స్క్రీప్ట్ కి ఓకే చెప్పాడు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకి తాత్కాలికంగా ‘టపోరి’ అనే పేరు ఖరారు చేశారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ గతవారం మహేష్ బాబుకు స్టోరీ చెప్పడానికి 3రోజులు స్పెయిన్ నుండి వచ్చాడు. ఈ ప్రాజెక్ట్ ను మహేష్ బాబు కొద్ది రోజులకు ముందే ఒప్పుకోవడం జరిగింది, కాని అప్పుడు మహేష్ బాబు పూరి జగన్నాథ్ తో ఈ స్క్రిప్ట్ కు సంబంధించిన మరికొన్ని వివరాలను తీసుకురమ్మనడం జరిగింది. ఈ సినిమా కొద్ది రోజుల్లో ప్రారంభం కావచ్చు. ఈ సినిమాను బండ్ల గణేష్ నిర్మిచనున్నారు. మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ‘పోకిరి’, ‘బిజినెస్ మాన్’ సినిమాలు ఘన విజయాన్నిసాదించాయి.

మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత శ్రీను వైట్ల ‘ఆగడు’ లో, ఆ తరువాత క్రిష్ సినిమాలో నటించనున్నాడు. .

తాజా వార్తలు