అందాల భామ కాజల్ అగర్వాల్ తను నటించిన ‘బిజినెస్ మేన్’ విజయం సాధించడం పట్ల చాలా ఆనందంగా ఉన్నారు. మహేష్ సరసన నటించిన ఆమె ఈ చిత్రంలో అందాల ఆరబోత చేసారు. ఈ చిత్రంలో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కవుట్ అయ్యింది. ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ బిజినెస్ మేన్ ఇంతటి బ్లాక్ బస్టర్ సాధించినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.
మహేష్ బాబు బుల్లెట్ లాంటి వాడు అని ఆయనతో కలిసి పనిచేయడం థ్రిల్లింగ్ గా ఉందని చెప్పుకొచ్చారు. యాక్షన్ సన్నివేశాలు మరియు డైలాగులు తనకు బాగా నచ్చాయని అన్నారు. ‘చిత్ర’ అమాయకమైన అమ్మాయి పాత్ర అని అందుకే అంత బాగా పండినదని అన్నారు. అలాగే ఆమె ప్పోరి జగన్నాధ్ ని కూడా పొగడ్తలతో ముంచెత్తారు.