గ్రీన్ గణేష్ విగ్రహాలను ఉపయోగించాలన్న మహేష్ బాబు

గ్రీన్ గణేష్ విగ్రహాలను ఉపయోగించాలన్న మహేష్ బాబు

Published on Sep 9, 2013 9:00 AM IST

Mahesh
సూపర్ స్టార్ మహేష్ బాబుకి వినాయక చవితి పండుగ అంటే చాలా ఇష్టం. తన చిన్న తనంలో తను ఈ పండుగ కార్యక్రమాలలో చాలా ఉత్సాహంగా పాల్గొనేవాడు. ఈ వినయ చవితి సందర్బం గా కొన్ని రకాల కలర్ ని ఉపయోగించి తయారు చేసిన వినాయకులను వాడటం వల్ల పర్యావరణానికి తీరని నష్టం జరుగుతుంది. కావున ఇలాంటి వినాయకులను వాడకుండా మట్టితో తయారు చేసిన వినాయకుల విగ్రహాలను మాత్రమే ఉపయోగించాలని మహేష్ బాబు అన్నాడు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా మట్టితో తయారు చేసిన వినాయకుడి విగ్రహాలను ఉపయోగిస్తున్నట్టు తెలియజేశాడు.

ప్రస్తుతం మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘1-నేనొక్కడినే’ సినిమా షూటింగ్ లో బిజీ గా వున్నాడు. ఈ సినిమా షూటింగ్ యుకే, హైదరాబాద్ లలో షూటింగ్ జరుపుకుంది. త్వరలో ఈ సినిమా ప్రొడక్షన్ టీం మరో షెడ్యూల్ లో భాగంగా బ్యాంకాక్ వెళ్లనుంది. కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 10, 2014లో విడుదలవుకు సిద్దమవుతోంది.

తాజా వార్తలు