మహేష్, పవన్ అభిమానులు హోరెత్తిస్తున్నారు.!

మహేష్, పవన్ అభిమానులు హోరెత్తిస్తున్నారు.!

Published on Sep 13, 2020 11:13 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఇద్దరి పేర్లు పక్కపక్కన చదివితేనే వీరి అభిమానులకు ఒక రకమైన ఎనర్జీ వస్తుంది. ఈ ఇద్దరి కాంబో ఇప్పటికీ మన టాలీవుడ్ లో మరియు వీరి అభిమానులలో ఒక పెద్ద డ్రీం కాంబో అని కూడా చెప్పొచ్చు. ఇటీవలే పవన్ పుట్టినరోజు సందర్భంగా మహేష్ పవన్ కు విష్ చెయ్యడం పవన్ తిరిగి రిప్లై ఇవ్వడం ఒక్క వారి అభిమానుల్లోనే కాకుండా మొత్తం మన టాలీవుడ్ లోనే ఒక పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చాయి.

అయితే మన స్టార్ హీరోల సినిమాల విషయంలో వారి అభిమానులకు ప్రతీ చిన్న అంశం కూడా ప్రిస్టేజియస్సే.. అలా ఈ మధ్య ట్విట్టర్ లో ప్రతీ అంశానికి సంబంధించి హ్యాష్ ట్యాగ్స్ రూపంలో ట్రెండ్స్ చేస్తూ దుమ్ము రేపుత్ఉన్నారు. అందులో భాగంగా ఇపుడు ఈ ఇద్దరు అభిమానులు తమ హీరోలు నటిస్తున్న లేటెస్ట్ సినిమాల టైటిల్స్ తో ఒక అరుదైన ఫీట్ కు దగ్గర అవుతున్నారు.

మహేష్ నటిస్తున్న లేటెస్ట్ మాస్ ఫ్లిక్ “సర్కారు వారు పాట” టైటిల్ హ్యాష్ ట్యాగ్ తో 80 మిలియన్ కు పైగా ట్వీట్స్ వేయగా పవన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్” టైటిల్ పేరిట 75 మిలియన్ ట్వీట్స్ పడ్డాయి. దీనితో వీరి ఫాస్ట్ కు మొట్ట మొదటిసారిగా 100 మిలియన్ ట్వీట్స్ ఈ చిత్రాల టైటిల్స్ తో సెట్ చెయ్యడం ఖాయం అని చెప్పాలి. ఇది మన హీరోలకు వారి అభిమానులు ఇచ్చే ఒకరకమైన ప్రేమ మరి..

తాజా వార్తలు