సూపర్ స్టార్ మహేష్ బాబు, తన కొడుకు గౌతమ్ ఒకేసారి ‘1 – నేనొక్కడినే’ షూటింగ్ లో పాల్గుంటున్నారు. రెండు నిర్మాణ సంస్థలలో విడివిడిగా షూటింగ్ జరుపుకుంటున్నారు. మహేష్ బాబు నానాక్రాంగూడ లో షూటింగ్ జరుపుకుంటుంటే, గౌతం హైదరాబాద్ లో మరో లొకేషన్ లో జరుపుకుంటున్నాడు
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 10,2014 భారీ రీతిలో విడుదలకానుంది. ఈరోజు లీక్ అయి సోషల్ నెట్వర్క్ లో హల్ చల్ చేస్తున్న కొన్ని ఫోటోలు భారీగా ప్రభావితం చేశాయి. ఈ ఫోటోలు అధికారికంగా విడుదలకాలేదు, నిర్మాణ సంస్థలు ఈ చర్యలు పాలుపడిన వారిపై పోలీసుల ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు
కృతి సనన్ హీరోయిన్ గా పరిచయంకానుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సుకుమార్ ఈ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్నాడు. రామ్ ఆచంట, గోపి ఆచంట మరియు అనీల్ సుంకర సంయుక్తంగా ఈ సినిమాను 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ద్వారా నిర్మిస్తున్నారు