ఎలాంటి స్టార్ తారాగణం లేకుండా కేవలం ఒక యానిమేటెడ్ సినిమాగా రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “మహావతార్ నరసింహ”. దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించిన ఈ డివోషనల్ యాక్షన్ చిత్రం సంచలనాలు సెట్ చేసింది. వరల్డ్ వైడ్ గా 300 కోట్లకి పైగా గ్రాస్ ని కొల్లగొట్టిన ఈ సినిమా యూఎస్ మార్కెట్ లో లేట్ గా విడుదల అయ్యినప్పటికీ అక్కడ కూడా భారీ వసూళ్లు సొంతం చేసుకుందని చెప్పాలి.
ఇలా యూఎస్ లో భారీ మైల్ స్టోన్ 2 మిలియన్ డాలర్స్ గ్రాస్ కి అత్యంత చేరువలో నిలిచింది. స్టార్ హీరోల సినిమాలు కూడా చేరుకోలేకపోతున్న ఈ మార్క్ ని ఈ యానిమేటెడ్ సినిమా చేరబోవడం సెన్సేషన్ అనే చెప్పాలి. ప్రస్తుతానికి 1.95 మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకొని 2 మిలియన్ కి దగ్గరలో ఉంది. ఇక ఈ సినిమాకి సామ్ సి ఎస్ సంగీతం అందించగా క్లీం ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.
#MahavatarNarsimha North America gross reported till now is at $1,950,106+ and counting ❤️????
North America by @PrathyangiraUS #Mahavatar @hombalefilms @AshwinKleem @kleemproduction @VKiragandur @ChaluveG @MahavatarTales @PharsFilm pic.twitter.com/PlZztQszhY
— Prathyangira Cinemas (@PrathyangiraUS) September 10, 2025