పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ పై ఎన్ని అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు రెండేళ్లకు పైగా పవన్ వారి ఫ్యాన్స్ కి వెండి తెరపై దూరమయ్యారు. ఆయన నటించిన చివరి చిత్రం అజ్ఞాతవాసి 2018 జనవరిలో విడుదలయ్యింది. దీనితో ఆయనని ఎప్పుడు వెండితెరపై చూద్దామా అని ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక నిన్న ఈ చిత్రం నుండి మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మగువా మగువా.. అనే లిరికల్ సాంగ్ విడుదల చేయగా భారీ రెస్పాన్స్ దక్కించుకుంది.
విడుదలైన 24 గంటలలో ఈ సాంగ్ యూట్యూబ్ లో 4 మిలియన్ వ్యూస్ దాటివేసింది . అలాగే 4 లక్షలు పైగా లైక్స్ అందుకుంది. థమన్ స్వర కల్పనలో సిద్ శ్రీరామ్ పాడిన మగువా మగువా.. సాంగ్ యూత్ లోకి వెళ్ళిపోయింది. చాల చోట్ల ఈ సాంగ్ ఇప్పటికే సందడి చేస్తుంది. వకీల్ సాబ్ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు నిర్మిస్తున్నారు.