ఒకప్పటి అందాల భామ పాత తరం యువకుల మనసులు దోచిన మాధురి దీక్షిత్ హీరొయిన్ గా మళ్లీ రాబోతుంది. ప్రస్తుతం లైఫ్ ఓకే అనే కొత్త ఛానల్ లో ఒక ప్రోగ్రామ్ చేస్తుంది. సినిమాల్లో నటించమని చాలా ఆఫర్స్ వచ్చినప్పటికీ వాటిని ఆమె సున్నితంగా త్రోసిపుచ్చారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ‘ఇష్కియా’ సినిమాకి సీక్వెల్ గా రూపొందించే చిత్రంలో నటించమని అడిగినట్లుగా సమాచారం. మాధురి దీక్షిత్ కూడా దీనికి అంగీకరించినట్లు సమాచారం. దీనికి సంబంధించి త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.
మాధురి తనకు తగ్గట్లుగా పాత్రలు ఎంచుకుంటే మళ్లీ ఫేమస్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆ కాలంలో శ్రీదేవి, మాధురి ఇద్దరి మధ్య మంచి పోటీ ఉండేది. వచ్చే ఏడాది వీళ్ళిద్దరూ మళ్లీ తెరపై కనిపించబోతున్నారు.