అక్టోబర్ 11 నుండి చిత్రీకరణ మొదలు పెట్టుకోనున్న మధుర శ్రీధర్ 123

అక్టోబర్ 11 నుండి చిత్రీకరణ మొదలు పెట్టుకోనున్న మధుర శ్రీధర్ 123

Published on Sep 27, 2012 4:02 AM IST


“స్నేహ గీతం” మరియు “ఇట్స్ మై లవ్ స్టొరీ” వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన మధుర శ్రీధర్ ఇప్పుడు “123” అనే చిత్రంతో మన ముందుకు రానున్నారు. ఈ చిత్ర శీర్షిక “1 లైఫ్ 2 లవ్స్ 3 హార్ట్స్” . అజిత్ “గ్యాంబ్లర్” చిత్రంలో సహాయనటుడిగా చేసిన మహాత్ రాఘవేంద్ర ఈ చిత్రంలో కథానాయకుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు మరియు తమిళంలో నిర్మించాలని మధుర శ్రీధర్ అనుకుంటున్నారు. ఈ చిత్రంలో ఇద్దరి ప్రధాన కథానాయికలు ఎవరన్నది త్వరలో ప్రకటిస్తారు. ఈ చిత్ర చిత్రీకరణ అక్టోబర్ 11 నుండి మొదలు కానుంది. ఎం వి కే రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తుండగా ఫై జి విందా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

తాజా వార్తలు