మధుర శ్రీధర్ 123 చిత్రీకరణ మొదలు

మధుర శ్రీధర్ 123 చిత్రీకరణ మొదలు

Published on Oct 12, 2012 10:55 AM IST


మధుర శ్రీధర్ మూడవ చిత్రం అయిన 123 నిన్న హైదరాబాద్లో చిత్రీకరణ మొదలుపెట్టుకుంది. మహాత్ రాఘవేంద్ర ప్రధాన పాత్రలో ఈ చిత్రం ద్విభాషా చిత్రంగా తెరకెక్కనుంది. కలర్స్ స్వాతి మరియు మలయాళ నటి అర్చన కవి ఈ చిత్రంలో కథానాయికలుగా కనిపించనున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శీర్షిక 1 లైఫ్ 2 లవ్స్ 3 హార్ట్స్ . ఎంవికే రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మధుర శ్రీధర్ ఈ చిత్రాన్ని తెలుగు మరియు తమిళంలో తెరకెక్కిస్తున్నారు గతంలో మధుర శ్రీధర్ “స్నేహ గీతం” మరియు “ఇట్స్ మై లవ్ స్టొరీ” అనే చిత్రాలను తెరకెక్కించారు. ఈ చిత్రం గురించిన మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు.

తాజా వార్తలు