అంచనాలు లేకుండా రిలీజ్ కానున్న మణిరత్నం కడలి

అంచనాలు లేకుండా రిలీజ్ కానున్న మణిరత్నం కడలి

Published on Jan 31, 2013 5:54 PM IST

kadali

ఇండియా ఫేమస్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ మణిరత్నం డైరెక్ట్ చేసిన ‘కడలి’ సినిమా ఆంధ్ర ప్రదేశ్లో రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా చాలా తక్కువ అంచనాలతో రిలీజ్ అవుతోంది. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం కూడా ఎక్కడా ప్రమోషన్స్ చేయడం లేదు. సినిమా రేపే విడుదలైనప్పటికీ ఎక్కడా ప్రమోషన్ చేయడం లేదు.

గౌతం కార్తీక్ – తులసి నాయర్ హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో అరవింద్ స్వామి, అర్జున్, లక్ష్మీ మంచు కీలక పాత్రలు పోషించారు. ఎ.ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమాకి రాజీవ్ మీనన్ సినిమాటోగ్రాఫర్. సముద్రానికి దగ్గరగా ఓ చేపలు పట్టే గ్రామంలో జరిగే ఈ కథలో ఎక్కువ క్రిస్టియానిటీ కనిపించే అవకాశం ఉంది.

తాజా వార్తలు