ఇంతకీ ‘లవర్’ ఎవరు?

Lover
ఎప్పటికప్పుడు ఒకే టైటిల్ ని వేరు వేరు సినిమాలకి అనుకోవడం, కొన్ని చర్చలు జరిగిన తర్వాత ఎవరో ఒకరు ఆ టైటిల్ ని తీసుకోవడం ఇండస్ట్రీలో ఇప్పటికే పలుసార్లు జరిగింది. తాజాగా మరో టైటిల్ తో ఇండస్ట్రీలో దుమారం రేగనుంది. ఆ టైటిల్ పేరే ‘లవర్’. కొద్ది రోజుల క్రితమే నారా రోహిత్ హీరోగా, మోనాల్ గజ్జర్ హీరోయిన్ గా కొత్త డైరెక్టర్ కార్తికేయ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమాకి ‘లవర్ అనే టైటిల్ ని అనౌన్స్ చేసారు.

ఇదిలా ఉండగా ఈ రోజు ఉదయం దిల్ రాజు నిర్మాతగా వాసు వర్మ డైరెక్షన్లో ప్రారంభం కానున్న ఓ సినిమాకి ‘లవర్’ అనే టైటిల్ పెట్టామని ప్రెస్ నోట్ విడుదల చేసారు. ఇప్పడు ఈ టైటిల్ విషయమై ఏమన్నా వివాదం తలెత్తే అవకాశం ఉందా? అలాగే చివరికి ఈ ఇద్దర్లో ఎవరికీ ఈ టైటిల్ దక్కుతుందో అనే దాని కోసం కొంత సమయం వేచి చూడాలి.

Exit mobile version