టాలీవుడ్ లో త్వరలో రానున్న ‘లవ్ యు బంగారం’ సినిమా ఆడియో విడుదల ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లోని నోవోటల్ లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు హాజరవుతారని సమాచారం.
రాహుల్, రాజీవ్, శ్రావ్య ప్రధాన పాత్రలు పోషించారు. రాహుల్ ఇప్పటికే హ్యాపీ డేస్, రెయిన్ బో, ముగ్గురు సినిమాల్లో నటించాడు. తన గత సినిమాలు విజయాన్ని అందుకోకపోవడంతో రాహుల్ లవ్ యు బంగారం సినిమాపైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. అలాగే రాజీవ్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి కుమారుడు, అతను గతంలో నోట్ బుక్ అనే సినిమాలో కనిపించాడు. శ్రావ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా గంగోత్రి సినిమాలో తెరపై కనిపించింది. ఈ ముగ్గురికి ఈ సినిమా సరైన బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నారు.
కెఎస్ రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై వల్లభ – మారుతి సంయుక్తంగా నిర్మించారు. మహిత్ నారాయణ్ సంగీతం అందించిన ఈ సినిమా ద్వారా గోవి డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు.