సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇపుడు చేస్తున్న అవైటెడ్ చిత్రమే “కూలీ”. దీనిపై అంతకంతకు మంచి హైప్ సెట్ అవుతూ వస్తుండగా తమిళ్ సహా తెలుగు ఆడియెన్స్ కూడా చాలా ఎగ్జైటెడ్ గా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే లోకేష్ కనగరాజ్ సెట్ చేసిన స్టాండర్డ్స్ దెబ్బకి తన నెక్స్ట్ సినిమా ఏదైనా కూడా తన సినిమాటిక్ యూనివర్స్ కి కనెక్ట్ అయ్యి ఉందేమో అనే మాటే ఎక్కువగా వినిపిస్తుంది.
అయితే లోకేష్ కానగరాజ్ నుంచి వస్తున్న కూలీకి అలాగే కమల్ హాసన్ తో చేసిన విక్రమ్ చిత్రానికి లింక్ ఉందా అనే మాట ఎప్పుడు నుంచో ఉంది. అయితే లోకేష్ కంప్లీట్ గా రజినితో సినిమా సెపరేట్ అని చెప్పేసాడు. లేటెస్ట్ గా దీనిపై చేసిన మరో ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది. కూలీ కమల్ హాసన్ గారు చెయ్యలేరు అలాగే విక్రమ్ రజినీకాంత్ గారు చెయ్యలేరు సో రెండిటికీ ఎలాంటి సంబంధం లేదు. కూలీ పూర్తిగా కొత్త సినిమా అని తన సినిమాటిక్ యూనివర్స్ కి సంబంధం లేదని తాను క్లారిటీ ఇచ్చాడు.