బాలీవుడ్లో తెలుగు కుర్రాళ్ళ లాగిన్

బాలీవుడ్లో తెలుగు కుర్రాళ్ళ లాగిన్

Published on Oct 12, 2012 8:00 AM IST


మన తెలుగు కుర్రాళ్ళు బాలివుడ్లో తెరకెక్కించిన చిత్రం “లాగిన్” ఈ చిత్రం ఈరోజు అక్కడ విడుదల అయ్యింది ఇంటర్నెట్ వల్ల మనకి ఉన్న లాభాలు నష్టాల నేపధ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది ప్రేమ కామం మరియు శృంగారం ఆధారిత కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాక టైల్ పిక్చర్స్ సమర్పణలో సంజీవ్ మరియు రాజ్ కుమార్ పోనుగుపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సైబర్ క్రైమ్స్ నేపధ్యంలో సాగుతుంది. మనుషులు అంతర్జాలం మూలాన జీవితాన్ని కోల్పోతున్నారు అన్న అంశాన్ని సున్నితంగా తెలిపారు. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించగా కే కే రాజ్ కుమార్, హిమంశు భట్,రాధిక రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్, రఘు కుంచె ప్రశంసలలో ముంచెత్తారు. రామ్ గోపాల్ వర్మ మరియు అనురాగ్ వంటి వారు ఈ చిత్రాన్ని చూసి మెచ్చుకున్నారని దర్శకుడు తెలిపారు.

తాజా వార్తలు