ఆ హీరోతో ‘లిటిల్ హార్ట్స్’ డైరెక్టర్ మూవీ.. ఫిక్స్ అయ్యేనా..?

ఆ హీరోతో ‘లిటిల్ హార్ట్స్’ డైరెక్టర్ మూవీ.. ఫిక్స్ అయ్యేనా..?

Published on Oct 12, 2025 7:00 AM IST

టాలీవుడ్‌లో ఇటీవల వచ్చిన ‘లిటిల్ హార్ట్స్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో మౌలి తనుజ్ ప్రశాంత్, శివాని నగరం జంటగా నటించారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 40 కోట్ల వసూళ్లు సాధించి అదరగొట్టింది. ఈ చిత్రంతో సాయి మార్తాండ్ ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇప్పుడు అందరి దృష్టి యువ దర్శకుడు సాయి మార్తాండ్ తదుపరి ప్రాజెక్ట్‌పై ఉంది. ‘లిటిల్ హార్ట్స్ 2’ ఇప్పటికే ప్రారంభ దశలో ఉండగా, తాజా సమాచారం ప్రకారం సాయి మార్తాండ్ ఇటీవల హీరో నితిన్‌ను కలసి ఓ కథను వినిపించినట్లు తెలుస్తోంది. వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్న నితిన్ ‘ఎల్లమ్మ’ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని సమాచారం.

దీంతో నితిన్, దర్శకుడు విక్రమ్ కె. కుమార్ తో ఒక స్పోర్ట్స్ డ్రామా చిత్రాన్ని చేస్తున్నాడు. దాని తర్వాత సాయి మార్తాండ్ వినిపించిన లవ్ స్టోరీకి నితిన్ ఓకే చెబుతాడా లేడా అనేది ఆసక్తికరంగా మారింది.

తాజా వార్తలు