‘ఓజి’ కామిక్ బుక్.. ఫ్లాష్ బ్యాక్ లో పవన్ తో రచ్చే ఇక

‘ఓజి’ కామిక్ బుక్.. ఫ్లాష్ బ్యాక్ లో పవన్ తో రచ్చే ఇక

Published on Oct 11, 2025 10:00 PM IST

OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ చిత్రమే “ఓజి”. భారీ అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే రికార్డు వసూళ్లు సాధించి దుమ్ము లేపింది. మరి ఈ చిత్రాన్ని యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ విజన్ ఏ లెవెల్లో ఉందో అనేది సినిమా చూస్తేనే అర్ధం అయ్యింది కానీ ఈ సినిమాకి బ్యాక్ స్టోరీ సెటప్ మాత్రం ఇప్పుడు అందరినీ మెస్మరైజ్ చేస్తుంది.

ఈ సినిమా పార్ట్ 2 లో వరల్డ్ వార్, సుభాష్ చంద్రబోస్ లాంటి ఫ్లాష్ బ్యాక్ ఎలిమెంట్స్ మరింత ఎగ్జైట్మెంట్ ని తెచ్చి పెట్టాయి. ఇక లేటెస్ట్ గా మేకర్స్ రివీల్ చేసిన ఓజి ది ఫస్ట్ బ్లడ్ కామిక్ బుక్ ని రిలీజ్ చేయగా అందులో పలు స్లైడ్స్ వైరల్ అవుతున్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్ సుభాష్ చంద్రబోస్ సైన్యంలో ఒకడిగా పవర్ఫుల్ రోల్ లో కనిపిస్తున్నాడు. దీనితో ఇవి చూసిన ఫ్యాన్స్ ఓజి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ లో మాత్రం సుజీత్ పవన్ తో కలిసి రచ్చ చూపిస్తాడని గట్టిగా ఫిక్స్ అయ్యిపోయారు. మరి మొత్తానికి మాత్రం ఓజి యూనివర్స్ పెద్దగానే అయ్యేలా కనిపిస్తుంది.

OG

తాజా వార్తలు