పిక్ టాక్ : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మళ్లీ మొదలెట్టాడు..!

పిక్ టాక్ : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మళ్లీ మొదలెట్టాడు..!

Published on Oct 11, 2025 9:00 PM IST

Ustaad-Bhagat-Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ కోసం ప్రేక్షకులు కూడా ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు.

ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే, తాజాగా తన కొత్త షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ ప్రారంభించింది. సెట్స్ నుండి దర్శకుడు హరీష్ శంకర్ ఓ తుపాకీ పట్టుకుని పోస్ ఇచ్చారు. దీంతో ఈ షెడ్యూల్‌లో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తు్న్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తాజా వార్తలు