ఇంటర్వ్యూ : హీరోయిన్ రాశి ఖన్నా – ‘తెలుసు కదా’ కథ చాలా యూనిక్!

ఇంటర్వ్యూ : హీరోయిన్ రాశి ఖన్నా – ‘తెలుసు కదా’ కథ చాలా యూనిక్!

Published on Oct 12, 2025 1:00 AM IST

Raashii-Khanna

పాపులర్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘తెలుసు కదా’ అక్టోబర్ 17న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ రాశి ఖన్నా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

తెలుసు కదా లో మిమ్మల్ని ఎక్సయిట్ చేసిన ఎలిమెంట్స్?

చాలా ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ చూసుకుంటాం. కానీ ఇందులో ఒక యూనిక్ పాయింట్ ఉంది. ఆ పాయింట్ మీరు థియేటర్స్ లో చూడాలి. అది ఆడియన్స్ ని ఎక్సయిట్ చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ లో చాలా సర్‌ప్రైజ్ అయ్యాను. ఇలాంటి సర్ ప్రైజ్ ఆడియన్స్ ఎక్స్ పీరియన్స్ చేస్తారు. చాలా కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ లవ్, బౌండరీస్ గురించి మాట్లాడుకుంటారు. ఇలాంటి పాయింట్ తో సినిమా ఇప్పటి వరకు నేను చూడలేదు.

సిద్ధు గారితో వర్క్ ఎక్స్‌పీరియన్స్ గురించి?

సిద్ధు ఆన్‌సెట్ లో క్రాఫ్ట్ మీద చాలా సీరియస్ గా ఉంటారు. ఆయనకి ప్రతి క్రాఫ్ట్ మీద చాలా గ్రిప్ ఉంటుంది. ఆయనతో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్.

డైరెక్టర్ నీరజ గారి గురించి?

నీరజ గారు కథ చెప్పినప్పుడు షాక్ అయ్యాను. అంత యూనిక్ స్క్రిప్ట్ ఎలా రాయగలిగారనిపించింది. తనకు ప్రతి విషయంపై నాలెడ్జ్ ఉంది. ఒక ఎక్స్‌పీరియన్స్డ్ డైరెక్టర్ తో వర్క్ చేసినట్లుగానే అనిపించింది.

తమన్ మ్యూజిక్ గురించి?

తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. చాలా పాషన్ తో వర్క్ చేస్తారు. ‘మల్లిక గంధ’ పెద్ద హిట్ అయ్యింది. పాటలన్నీ చాలా అద్భుతంగా వచ్చాయి.

శ్రీనిధి గురించి?

మా కాంబినేషన్ లో చాలా మంచి సీన్స్ ఉన్నాయి. తను చాలా ఫన్ పర్సన్. మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం.

నిర్మాతల గురించి?

విశ్వ ప్రసాద్ గారితో వెంకీ మామ చేశాను. ఇది సెకండ్ ఫిల్మ్. చాలా పాషన్ ఉన్న ప్రొడ్యూసర్. సినిమాకి కావాల్సిన ప్రతిది సమకూర్చారు.

తాజా వార్తలు