“వకీల్ సాబ్” కు అక్కడ లిమిటెడ్ గానే.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ కం బ్యాక్ చిత్రం “వకీల్ సాబ్”. దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కించిన ఈ చిత్రంపై ఒకప్పుడు ఒకలా హైప్ ఉండేది ఇప్పుడు మరొకలా ఉంది. అయితే ఈ చిత్రం విడుదల తేదీ ఎప్పుడు అన్నది కూడా రివీల్ చేసారు. కానీ బిజినెస్ పరంగా ఈ చిత్రం అనుకున్న ఇంపాక్ట్ కలిగిస్తుందా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. మరి అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రం తాలుకా బిజినెస్ కాస్త లిమిటెడ్ అండ్ డీసెంట్ గానే జరుగుతుందట.

దానికి సంబంధించే ఈ సినిమా ఓవర్సీస్ బిజినెస్ లెక్కలపై టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రానికి బిజినెస్ అక్కడ కేవలం 8 కోట్ల లోపే బిజినెస్ ఉంటుంది కానీ అంతకు మించి వెళ్లే ప్రసక్తే లేదని తెలుస్తుంది. ఎలాగో రీమేక్ సినిమానే కాబట్టి ఫ్యాన్స్ లో కూడా దీనిపై పెద్దగా హైప్ లేదు. ఓపెనింగ్స్ అయితే గట్టిగానే వస్తాయి కానీ మిగతా దర్శకుడు చేసిన మార్పులు బట్టే ఉంటుంది అని చెప్పాలి. మరి ఈ చిత్రం ఎలా ఉండనుందో తెలియాలి అంటే ఈ ఏప్రిల్ 9 వరకు ఆగాల్సిందే.

Exit mobile version