లేటెస్ట్ గా పాన్ ఇండియా లెవెల్లో ఆడియెన్స్ ని ఎంతగానో అలరిస్తున్న ఒక కంప్లీట్ యానిమేషన్ చిత్రమే “మహావతార్ నరసింహా”. కనీసం ఎలాంటి స్టార్ కాస్ట్ హంగామా లేకుండా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఒక సర్ప్రైజింగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమాపై మొదట్లో పెద్దగా ఎవరిలోని అంచనాలు లేకపోవచ్చు కానీ మౌత్ టాక్ దెబ్బకి తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో సెన్సేషన్ ని సెట్ చేస్తుంది.
ఇలా రిలీజ్ కి ముందు ఎలాంటి ఓటిటి డీల్ ని ఈ సినిమా పూర్తి చేసుకోలేదు. ఇండియన్ సినిమా దగ్గర ఈ తరహా సినిమాలకి మరీ ఎక్కువ ఆదరణ లేదని అందరికీ తెలిసిందే. కానీ ఈ పర్టిక్యులర్ సినిమా మాత్రం అన్నీ బాగుంటే థియేటర్స్ కి జనం వస్తారు అని ఆ అపోహని పోగొట్టి అదరగొట్టింది. దీనితో ఇపుడు భారీ ఓటిటి ధరలు ఈ సినిమాకి వస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.
టాప్ 3 ఓటిటి సంస్థలు ఈ సినిమా హక్కులు కోసం పోటీ పడుతున్నట్టుగా ఇప్పుడు టాక్. కానీ మేకర్స్ మాత్రం ప్రస్తుతానికి డీల్స్ హోల్డ్ లోనే ఉంచుతున్నారట. సరైన ధర వచ్చినప్పుడే ఈ సినిమా అమ్మాలని చూస్తున్నారట. ఇక దీనితో పాటుగా ఈ సినిమా సుమారు 60 రోజులు తర్వాతే ఓటిటిలోకి వస్తుంది అని తెలుస్తుంది.