ప్రస్తుతం తమిళ నాట మంచి డిమాండ్ ఉన్న స్టార్ దర్శకుల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేస్జ్ కనగరాజ్ కూడా ఒకరు. తన సినిమాలతో భారీ హైప్ ని సెట్ చేసుకున్న ఈ దర్శకుడు నుంచి ప్రస్తుతం వస్తున్న చిత్రమే “కూలీ”. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ లో తాను స్టార్ నటుడు అజిత్ తో సినిమా ఎపుడు అనే దానిపై కామెంట్స్ చేయడం జరిగింది.
తనకి అజిత్ సార్ అంటే చాలా ఇష్టం అని తమ మధ్య సినిమా సరైన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉంటుంది అని కన్ఫర్మ్ చేసాడు. దీనితో ఈ క్రేజీ కలయికపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. లోకేష్, రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి సీనియర్ స్టార్స్ తో చేయగా తమ నెక్స్ట్ జెనరేషన్ లో దళపతి విజయ్ తో రెండు సార్లు చేసాడు. ఇక అజిత్ మాత్రం బాకీ ఉన్నాడు. వీరి కాంబినేషన్ లో సినిమా కోసం ఎప్పుడు టైం వస్తుందో చూడాలి.