లైఫ్ స్టైల్ ప్రచారకర్తగా శ్రుతి హాసన్

లైఫ్ స్టైల్ ప్రచారకర్తగా శ్రుతి హాసన్

Published on Apr 4, 2013 9:15 PM IST

Shruthi-Haasan

అమెరికన్ స్వాన్, ప్రపంచ ఆన్ లైన్ ఫ్యాషన్ సంస్థ లైఫ్ స్టైల్ మన సుందరి శ్రుతి హాసన్ ని డిజిటల్ ప్రచారకర్తగా ఎంచుకుంది. అమెరికాకు సంబందించిన ఈ సంస్థ తమ కార్యకలాపాలను నవంబర్ 2012 లో ప్రారంబించనుంది. మొదట్లో వీరు క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ ని ఎన్నుకున్నారు. ఈ సంస్థ శ్రుతి ని ఎంపిక చేసుకోవడం గురించి సి.ఈ.వో మాట్లాడుతూ “యువతను దృష్టిలో పెట్టుకుని శ్రుతిని ఎంపిక చేసాము. ఈమె వ్యక్తిత్వం అసాధారణం. బెరుకు లేకుండా చాలా చక్కగా నటించగలదు. అతి కొద్ది మంది మల్టీ టాలెంటెడ్ హీరోయిన్స్ లో ఈమె ఒకరని ” తెలిపారు. శ్రుతి ట్విట్టర్లో “అమెరికన్ స్వాన్# ఫ్యాషన్ కంట్రీ లో ఎంపిక అవ్వడం ఆనందకరం!! అక్కడ దుస్తులు నాకు ఇష్టం… స్టైలిష్ గా సౌకర్యవంతంగా ఉంటాయి”అంది. ఇప్పటికే శ్రుతి కళాంజలి మరియు కార్నెట్టో లకు ప్రచారకర్తగా పనిచేస్తుంది.

తాజా వార్తలు