లైఫ్ ఆఫ్ పై అద్భుతంగా ఉంది – ఎ.ఆర్ రెహమాన్

లైఫ్ ఆఫ్ పై అద్భుతంగా ఉంది – ఎ.ఆర్ రెహమాన్

Published on Nov 18, 2012 8:02 PM IST


హాలీవుడ్ డైరెక్టర్ ఆంగ్ లీ దర్శకత్వంలో రానున్న ‘లైఫ్ ఆఫ్ పై’ సినిమా పై విడుదలకి ముందే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేస్తోంది. ఇర్ఫాన్ ఖాన్, సూరజ్ శర్మ మరియు టబు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా యు.ఎస్.ఎ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించగా అది చూసిన ఆడియన్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ వారు ఈ సినిమాని ఇండియాలో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి ఎ.ఆర్ రెహమాన్ కి మరియు చెన్నైలో కొంతమందికి చూపించారు. ‘ ఇప్పుడే ఫాక్స్ స్టూడియోస్ లో ‘లైఫ్ ఆఫ్ పై’ సినిమా చూసాను. సినిమా అద్భుతంగా ఉంది మరియు సినిమాలో తమిళం గురిచి చాలా ఉంది. అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా అని’ ఎ.ఆర్ రెహమాన్ ట్వీట్ చేసారు.

యాన్ మార్టేల్ రాసిన నవల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఒక షిప్ అకస్మాత్తుగా ప్రమాదానికి గురై మునిగిపోగా అందులో ముంచి ఓ చిన్న పడవలో బయటపడ్డ కుర్రాడు, అతనికి తెలియకుండా అతని పడవలో ఉన్న ఒక బెంగాల్ టైగర్, జీబ్రా, హైనా, ఒక ఓరంగ్ ఉతన్ ఆ నది సముద్రం నుండి వారి ప్రయాణం ఎలా సాగింది అనేది కథాంశం. గతంలో ‘సెన్స్ అండ్ సెన్సిబిలిటీ’, క్రౌచింగ్ టైగర్’, ‘హిడన్ డ్రాగన్’ ‘హల్క్’ మరియు ‘బ్రోకెబ్యాక్ మౌంటెన్’ లాంటి సినిమాలు తీసిన ఆంగ్ లీ ఈ సినిమాని 3డిలో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో తీసారు. ఈ సినిమా కథ ఎక్కువగా ఇండియాకి సంబంధం ఉంటుంది ముఖ్యంగా పాండిచ్చేరికి. ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్ వారు తెలుగు తమిళ మరియు హిందీ భాషల్లో ఈ నెల 23 న విడుదల చేయనున్నారు.

తాజా వార్తలు