ఇటీవల విడుదలైన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, రెబల్, బ్రదర్స్, తాండవం సినిమాలని గమనిస్తే చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడానికి ట్రై చేసాయి కానీ అప్పటికే సమయం మించిపోవడంతో సినిమా పరాజయం చూడాల్సి వచ్చింది. ఏ విషయంలో చేతులు కాల్చుకున్నారు అంటారా? సినిమా విడుదలకి ముందు దాదాపు మూడు గంటల నిడివితో ఈ సినిమాలు విడుదలయ్యాయి. మూడు గంటల నిడివికి తగ్గ టైట్ స్క్రీన్ప్లే లేకపోవడంతో సినిమా మొదలైన రోజు నుండే ప్రేక్షకుల నుండి విమర్శలు మొదలవడంతో దాదాపు 15 నుండి 30 నిమిషాల పాటు కత్తెర వేసారు. కానీ అప్పటికే సమయం మించిపోవడంతో పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఈ సినిమా దర్శకులు ఇకమీదట ఐనా ఇలాంటి తప్పులు మళ్లీ జరగకుండా చూసుకుంటారేమో చూడాలి.