బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “లక్ష్మీ బాంబ్” ట్రైలర్ నిన్ననే రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే. స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం కోసం బాలీవుడ్ జనం గట్టిగానే ఎదురు చూస్తున్నారు. కాంచన చిత్రానికి రీమేక్ గా వస్తున్న ఈ భారీ సినిమా ట్రైలర్ తో మరింత స్థాయిలో భారీ రెస్పాన్స్ ను అందుకుంది.
ఈ ట్రైలర్ కు ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది అంటే అన్ని సామజిక మాధ్యమాల్లో ఈ ట్రైలర్ అత్యధికంగా వీక్షించబడిన ట్రైలర్ గా రికార్డు నెలకొల్పింది. ఒక్క యూట్యూబ్ నుంచి ఈ ట్రైలర్ కు 37.2 మిలియన్ వ్యూస్ రాగా మిగతా సామాజిక మాధ్యమాలతో కలిపి మొత్తం 70 మిలియన్ వ్యూస్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇదే మన ఇండియన్ సినిమాలో రికార్డ్ అట. ఈ చిత్రం వచ్చే నవంబర్ 9న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డైరెక్ట్ స్ట్రీమింగ్ రిలీజ్ తో పాటుగా పలు దేశాల్లో థియేట్రికల్ రిలీజ్ కానుంది.