మహిళా దినోత్సవ వేడుకలలో అతిథిగా పాల్గొన్న జయశ్రీ రాచకొండ

మహిళా దినోత్సవ వేడుకలలో అతిథిగా పాల్గొన్న జయశ్రీ రాచకొండ

Published on Mar 8, 2020 3:00 PM IST


మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘సి.ఎం.ఆర్.టెక్నికల్ క్యాంపస్’ అటానమస్ కాలేజీ విద్యార్థినులు నిర్వహించిన మహిళా సాధికార సదస్సులో తెలంగాణ హైకోర్టు న్యాయవాది-ప్రముఖ నటీమణి జయశ్రీ రాచకొండ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సి.ఎం.ఆర్.టెక్నికల్ క్యాంపస్ సెక్రటరీ సి.వసంతలక్ష్మి, విమెన్ ఎంపవర్ మెంట్ సెల్ చైర్మన్ ఏ.రాజారెడ్డి, కన్వీనర్ టి.మీనాక్షి, మెంబర్స్ డాక్టర్ కవితారాణి, డాక్టర్ సుధా అరవింద్, ఫ్యాకల్టీ సౌమ్యా కిరణ్, యామిని, ప్రీతి తదితరులు ఈ సదస్సులో పాల్గొని సాధికారత దిశగా మహిళలు ముందడుగు వేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ అంశాన్ని స్పృశిస్తూ రూపొందించిన పింక్, మర్ధాని-2 వంటి చిత్రాలను చూడవలసిందిగా సూచించారు.

ముఖ్య అతిధి ‘లాయర్ టర్నెడ్ యాక్ట్రెస్’ జయశ్రీ రాచకొండ మాట్లాడుతూ..”ప్రతికూల పరిస్థితుల్లోనూ సానుకూల దృక్పధంతో, సంకల్పబలంతో ముందుకు సాగి, నిర్దేశిత లక్ష్యాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. మన కళ్ళముందు తిరుగాడే వ్యక్తుల నుంచి ప్రేరణ పొందాలని ఉద్భోదించారు. ముని మనవరాలను సాకుతూ.. ఆరు పదులకు చేరువలో.. డిగ్రీ పట్టా పుచ్చుకున్న తన తల్లి తనకు మార్గదర్శి అని.. విద్యార్థినుల కరతాళ ధ్వనుల మధ్య పేర్కొన్నారు. అనంతరం ముఖ్య అతిధిగా విచ్చేసి, స్ఫూర్తిదాయక ప్రసంగం చేసిన జయశ్రీ రాచకొండను… సి.ఎం.ఆర్.టెక్నికల్ క్యాంపస్ సెక్రెటరీ వసంతలక్షి, ఇతర సిబ్బంది దుశ్శాలువతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు.

తాజా వార్తలు