మనోజ్ తో అందాల రాక్షసి జోడీ కట్టనుందా?

Lavanya_Manchu_Manoj

అందాల రాక్షసి ఫేం లావణ్య త్రిపాఠి గుర్తుంది కదా. యువకుల మనసు దోచుకున్న ఈ అమ్మాయి ఆ సినిమా తరువాత మరే సినిమా అంగీకరించలేదు. మంచు మనోజ్ సరసన లావణ్య నటించే అవకాశాలు ఉన్నాయని తాజా సమాచారం. పంచాక్షరి చిత్రాన్ని నిర్మించిన బొమ్మదేవర రామచంద్ర రావు రెండవ సినిమా మనోజ్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మనోజ్ సరసన లావణ్య కథానాయికగా నటించనుందని సమాచారం. అందాల రాక్షసి విజయం సాధించకపోవడంతో ఈ అమ్మాయికి అవకాశాలు దక్కలేదు. ఈ సినిమా విజయం సాధించి ఆమెకి మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుందాం.

Exit mobile version